సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి బంగాళాఖాతం వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలకు బాగా పనిచేసింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. పైన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నేడు, శుక్రవారం ఉదయం భద్రాచలం వల్ల గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. 9,74,666 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాజమండ్రి వద్ద కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వర్గాలు సూచించాయి.
