సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: త 2నెలలుగా రికార్డు స్థాయిలో పెరుగుతూ పోయిన చికెన్, గుడ్ల ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎట్టకేలకు తాజగా తగ్గుముఖం పట్టాయి. ఈ ధరల తగ్గుదల సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు మరియు మాంస ప్రియులకు పెద్ద ఊరటనిచ్చింది. ధరల వివరాలను పరిశీలిస్తే, గతంలో కిలో స్కిన్ లెస్ చికెన్ సుమారు రూ. 300 నుంచి రూ. 340 వరకు విక్రయించబడేది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో రూ. 250 నుంచి రూ. 280 మధ్య లభిస్తోంది. అలాగే, ఒక్కో కోడిగుడ్డు ధర కూడా గణనీయంగా తగ్గింది. గతంలో రిటైల్ మార్కెట్లో రూ. 8 నుంచి రూ. 9 వరకు విక్రయించిన ఒక్కో గుడ్డు ధర ఇప్పుడు రూ. 6 నుంచి రూ. 7కు చేరింది. ఇటీవల వర్షాలు పడటం పౌల్ట్రీ లలో కోళ్ల ఆరోగ్యం మెరుగుపడి బరువుతో పాటు గుడ్ల ఉత్త్పత్తి పెరగటం మార్కెట్లో సరఫరా మెరుగుపడటం, అలాగే డిమాండ్‌లో వచ్చిన మార్పుల వల్లే ఈ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *