సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో 2.75 లక్షల ఆర్థికంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు నేరుగా లబ్ధి! ఏపీ లో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల్లో వారు పొందే రుణాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కీలక మినహాయింపులు ప్రకటించింది. బ్యాంకులు వసూలు చేసే సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, 5లక్షల కు మించి పెద్ద మొత్తంలో తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. .ఇప్పటివరకు మహిళా సంఘాలు గ్రామీణ బ్యాంకుల నుంచి రుణాలు పొందే సమయంలో అనేక రకాల సేవా రుసుములు చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజాగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఇవన్నీ రద్దు కానున్నాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్స్‌పెక్షన్ రుసుము, పాస్‌బుక్, లెడ్జర్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలను కూడా ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. వీటిని రద్దు వల్ల ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఏడాదికి సగటున రూ.25,000 వరకు ఆదా కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
