సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉదయం భీమవరం బ్రహ్మకుమారీస్ సంస్థ సభ్యులు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, బ్రహ్మకుమారీస్ సంస్థ మరియు మై భారత్ (My Bharat) సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ’10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమం’ గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు వ్యసన రహిత భారత దేశ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములై, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన, వ్యసన రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని రఘురామకృష్ణ రాజు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *