సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణ ప్రధాన సెంటర్స్ లో శ్రీనివాస్ వర్మకు శుభాకాంక్షలు ప్లెక్సీ ల శుభాకాంక్షల కోలాహలం కనపడింది. ఈ నేపథ్యంలో( పైన తాజా ఫొటోలో ) ఢిల్లీ లో ఉన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సోషల్ మీడియా లో విడుదల చేసిన పోస్టులో.. ఈరోజు నా పుట్టినరోజున ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కుటుంబ సమేతంగా కలిసి, వారి ఆశీస్సులు తీసుకున్నాను. ప్రధాని మోదీ గారు వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి, ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధుర క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సందర్భంగా ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియచేసాను. మీ ఆశీస్సులు, ఈ స్ఫూర్తి నన్ను దేశ సేవలో మరింత ముందుకు నడిపిస్తాయి. అని పేర్కొన్నారు. మిత్రులు శ్రీనివాస్ వర్మ గారికి మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ తరపున కూడా శుభాబినందలూ తెలియజేస్తున్నాము.. మీ సిగ్మా ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *