సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఇటీవల విజయాలు లేక వెనుకబడిన సీనియర్ హీరో రవితేజ ఈనెల 21న విడుదల కానున్న ‘ ఇరుముడి’ సినిమా తో తనను అయ్యప్ప స్వామి గట్టెక్కిస్తారని నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు రాష్ట్రాలలో మంచి పబ్లిసిటీ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భీమవరం లో ప్లాన్ చేసారు. ఈనెల 12వ తేదీన భీమవరం ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వేడుకలు జరిగిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇటీవలే ఇక్కడ వరుణ్ తేజ్ .. కొరియా కనకరాజు కూడా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ సెంటిమెంట్ తో ‘ఇరుముడి’ తో రవితేజ భీమవరం రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి హీరో రవితేజ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఖండవిల్లి చెందినవారు కావడం గమనార్హం.
