సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: . 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరంలోని పలు చోట్ల ఎమ్మెల్యే అంజిబాబు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. భీమవరం మున్సిపల్ కార్యాలయం, ( పైచిత్రం) తహశీల్దార్ కార్యాలయం, ఏరియా ప్రభుత్వాసుపత్రి, ఎంపిడివో, ఎఎంసి కార్యాలయం, బాంబే స్వీట్స్ సెంటర్ లోని గాంధీజీ విగ్రహం వద్ద, కోస్టల్ సిటీ సెంటర్ లో మువ్వనేల పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడారు. దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలర్పించారన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలు ఫలితంగా స్వతంత్రం సాధించామని, భగత్ సింగ్ , సుభాష్ చంద్రబోస్ నినాదాలు ఆనాడు ప్రజలను కదిలించాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, తహశీల్దార్ రావి రాంబాబు, అధికారులు, ఎండివో, ఎంపీపీ, సిబ్బంది, ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ జీతానంద్, వైద్యులు, సిబ్బంది, ఎఎంసి చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు.
