సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరంలోని అంబేద్కర్ భవన్‌లో ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా 12వ మహాసభలు జరిగాయి. ఏఐటీయూసీ పతాకాన్ని సీనియర్ నాయకులు సుబ్బారావు ఆవిష్కరించారు. మహాసభలకు అధ్యక్ష వర్గంగా కోనాల భీమారావు, మందుల లక్ష్మి,తాటికొండ వాసు, వ్యవహరించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతున్నప్పటికీ,వారి జీవన ప్రమాణాలు మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదన్నారు. ..భీమవరం పట్టణ :కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత,కనీస వేతనాలు, సామాజిక భద్రత సాధన కోసం ఏఐటీయూసీ కార్మిక ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసందరం మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏఐటీయూసీకి 80 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందన్నారుఅసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వారందరినీ సంఘటితం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *