సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు ప్రారంభించిన నిరసనలు నేడు మంగళవారం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈసీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన ఇండియాకూటమి పార్టీల నేతలు , కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ నిరసనకు తెరతీశారు. విపక్ష ఎంపీలను అడ్డుకునేందుకు పోలీసులు ఈసీ కార్యాలయం ఎదుట బారికేడ్లను ఏర్పాటు చెయ్యడం తో ఈసీ కార్యాలయానికి (నిర్వచన్ సదన్) కొద్ది దూరంలో రాహుల్ గాంధీ ఓ బారికేడ్ ఎక్కి నిరసనకు తెలిపారు. ఓటు చోరీ దొంగ తప్పించుకోలేరని వారిని వదిలేది లేదని నినాదాలు చేసారు.జాతీయ జెండాని ఊపుతూ రాహుల్ గాంధీ నిరసన తెలుపుతుం ‘ఈసీని చీటింగ్ కమిషన్’ అంటూ నినాదాలు చేసారు. అక్కడే ఉన్న ఇతర నిరసనకారులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు రాహుల్ గాంధీ, మరో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు వాహనం నుంచి దిగి మళ్లీ నిరసనకు తెరతీశారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల వరకూ తమ నిరసనను కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *