సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జమ్మూకశ్మీర్ పర్యటన సందర్భంగా అక్కడి అభివృద్ధి ప్రశాంత జనజీవితానికి ముచ్చటపడి అమెరికా రాయబారి సెర్గియో గోర్ (US Ambassador Sergio Gor) భారత్ లో అవి భాగాలే అని , ఇటీవల జమ్మూ,కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు బాగా మెరుగుపడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయని జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో ఒక ముఖ్యమైన భాగంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి పాకిస్థాన్ అధికారికంగా నిరసన తెలిపింది. పాకిస్థాన్ చర్యపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్ లో జమ్మూ కాశ్మిర్ అప్పుడు ఉంది. ఇప్పుడు ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఎందుకు అమెరికా ప్రకటనపై పాక్ ఉలిక్కి పడిందో తెలియదు అని భారత్ విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ చురకలు అంటించారు..
