సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంపూర్ణ జీవితం గడిపి .. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటీమణి షావుకారు జానకి (95) చెన్నై కావేరీ హాస్పిటల్ లో నేడు, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దాదాపు 75 ఏళ్లుగా సినిమా రంగంలో నటిగా తనదైన ముద్రవేశారామె. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. తండ్రి రాజమండ్రిలో గవర్నమెంట్ పేపరు ఎక్స్ పర్టు అండ్ కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళు. వారిలో ఒకరు ప్రముఖ నటి కృష్ణకుమారి.పెద్దగా అందగత్తె కాకపోయిన తన అభినయం చక్కటి స్వష్టమైన తెలుగు తమిళ బాషా ఉచ్ఛారణలతో అనేక వందల సినిమాలు చేసిన జానకి గత 2 ఏళ్ళ క్రితం వరకు చక్కగా ఆరోగ్యం కాపాడుకొంటూ సినిమాలలో ఇంటర్యూ లలో తళుక్కున మెరిసేవారు. ఎన్టీఆర్ తో నటించిన షావుకారు సినిమా ఆమెకు బ్రాండ్ ఇమేజ్ తేవడంతో అదే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. నాగార్జున గీతాంజలి సినిమాలో నేటి యువత గురించి.. ఆమె వాయిస్ ఇప్పటికి ‘ఖంగు’మంటుంది మరి..
