సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ పరిధిలో SIR ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నేడు, శనివారం జిల్లా కలెక్టర్, నాగరాణి మరియు ఆర్డీఓ,, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి పరిశీలించారు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని సేంట్ మేరీస్ స్కూల్ లో నిర్వహిస్తున్న ‘సర్ ‘ (Special Intensive Revision) ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు అధికారులను అడిగి ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా, ఓటర్ల జాబితాలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు మరియు మున్సిపల్ సిబ్బంది ని ఆదేశించారు.
