సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో తాజగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వానలు పడే నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల వరుసగా మత్యకారులు సముద్రంలో గల్లంతు అవుతున్న ఘటనలు ఎక్కువ జరుగుతున్నా నేపథ్యంలో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించి వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. . ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈనేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి ఆదివారం తెల్లవారు జాము మరియు మధ్యాహ్నం భీమవరంతో సహా పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. మరో ప్రక్క ప్రచండంగా ఎండలు కాయడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *