సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక సినిమా థియేటర్స్ కు ప్రేక్షకులు వచ్చే రోజులు అయిపోతున్నాయి అనుకుంటున్నా సమయంలో గత రెండు నెలల నుంచి టాలీవుడ్‌ బాక్సాఫీసు కలెక్షన్స్ థియేటర్స్ లో సీట్లు కు పట్టిన దుమ్ము దులిపేస్తుంది… వీకెండ్‌ వస్తే చాలు హౌస్‌ఫుల్‌ బోర్డులు చాలా థియేటర్ల దగ్గర కనిపిస్తుండడమే దీనికి కారణం. ముఖ్యంగా ఈ రెండు నెలల కాలంలో విడుదలైన చిత్రాలకు టికెట్‌ రేట్‌ పెంపుదల లేకపోవడంతో ‘సినిమా బాగుంది’ అని టాక్‌ వస్తే చాలు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. కొత్త నటీనటులతో నాగబంధం భారీ చిత్రాన్ని మంచి పబ్లిసిటీ తో విడుదల చేసారు అభిషేక్‌ నామా. ఈ సినిమా అంతగా ఆడకపోయినా మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లు స్టార్ హీరోలను మరిపించాయి. ఇక సమంత సొంత బ్యానర్‌ ట్రాలాలా పిక్చర్స్‌ మీద లో బడ్జెట్ లో నిర్మించిన మా ఇంటి బంగారం’ సినిమా ఫ్యామిలీ వినోదం, లేడీస్ యాక్షన్ సన్నివేశాలతో తో కాసుల వర్షం కురిసింది. మహా భారతం లోని పాత్రలను సోషలైజ్ చేసి నిర్మించిన ‘ లెనిన్’ సినిమా అక్కినేని అఖిల్ ని హీరోగా నిలబెట్టింది. ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. విభిన్న చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్న యువ హీరో కిరణ్ సబ్బవరం తాజా చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సమాధి నుంచి కూడా లేచి వచ్చే ప్రియుడి కథతో ఫాంటసీ తెరకెక్కితే జనాలందరూ బ్రహ్మ రధం పట్టారు. పాటలు మ్యూజికల్ హిట్. సుమారు 80 కోట్ల పైగా కలెక్షన్స్ తో బంపర్ హిట్ అందుకొన్నారు డైరక్టర్‌ రవి నంబూరి. నిర్మాతలు ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌. హిట్స్ లేక గత 4 ఏళ్లుగా వెనుకబడిన వరుణ్ తేజకి హిట్‌ వచ్చేసింది. కొరియన్‌ కనకరాజు. స్టఫ్‌ ఉన్న డైరక్టర్‌ మేర్లపాక గాంధీ ఈ సినిమాతో 40 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. సత్య కామెడీ టైమింగ్‌, పెద్ద ప్లస్ అయ్యింది. వరుస సక్సె్‌సలతో దూసుకుపోతున్న యువ డైరక్టర్‌, సడన్‌గా డి సి సినిమా తో హీరోగా మారిపోయిన లోకేష్‌ కనగరాజ్‌ . అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రూ. 80కోట్ల వసూళ్లను తెలుగు తమిళంలో అందుకోంది. సుమారు దశాబ్దంగా సరైన హిట్ లేక విలవిలాడుతున్న హీరో సూర్య ఇటీవల తమిళ్ లో వీరభద్రుడు తో మంచి విజయం సాధించాక అందరు తెలుగు వారి ఆధ్వర్యంలో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. తో తెలుగునాట 70కోట్ల పైగా తమిళ్ తో కలపి 150 కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు.. వెంకీ అట్లూరి, తన మార్కు రైటింగ్‌తో, మేకింగ్‌తో మెస్మరైజ్‌ చేశారు. గత 4 ఏళ్లుగా సరైన హిట్ లేక వరుసగా 6 సినిమాలు పరాజయాలు తరువాత సీనియర్ హీరో ‘రవితేజ’ ఇరుముడి సినిమా గత 4 రోజులుగా చేస్తున్న ప్రభంజనం స్వామియే శరణం అయ్యప్ప.. అంతే .. రోజు రోజుకి పెరుగుతున్న ఈ సినిమా ఆదరణ రవితేజ కెరీర్ లోనే పెద్ద హిట్ గా200 కోట్ల దిశగా నిలబడే అవకాశం ఉంది. కేవలం 3 రోజులకే 60 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *