సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం వెలుగులోకి వచ్చింది.. ఈనెల 20న సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. ఆటోలో వచ్చి శ్రీశైలం వడ్డెర సత్రంలో రూమ్ నంబర్ 11ను తీసుకున్నారు. గత 3 రోజులుగా బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తెరచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని కనిపించారు. మృతులు సుధాకర్(36), గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా గుర్తించారు. .అప్పులు ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాధమిక సమాచారం.
