సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది వచ్చే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో జిన్‌పింగ్ పర్యటించే అవకాశాలు స్వష్టం అవుతున్నాయి. . 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది జిన్‌పింగ్ వెంట సుమారు 400 మంది అధికారులు, ప్రతినిధులతో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ( file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *