సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పేరు రావడానికి స్ఫూర్తి దాయకమైన 1100 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో నూతన కల్యాణ మండపం నిర్మించడానికి దాతల సహకారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం పురాతన రావి చెట్టును పాత కల్యాణ మండపం వేదికను తొలగించి ఇప్పటికే చదును చెయ్యడం జరిగింది. ఈనెల 30వ తేదీన ఉదయం 10:55 శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ మండపం శంకుస్థాపనకు ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసరావుని భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గన్రెడ్డి త్రినాధ రావు , ఈవో శ్రీనివాసరావు ధర్మకర్తలు మల్లు వలస రఘుబాబు గంగాధర ఆహ్వానించడం జరిగింది ఇంకా రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మరియు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ,మాజీ ఎమ్మెల్యే రామరాజు, మెంటే పార్థసారధి ని మరికొందరు ప్రముఖులను ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *