సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, గురువారం నష్టాల్లో ముగిశాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, సిమెంట్ షేర్లు క్షీణించడంతో సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 539.35 పాయింట్లు లేదా 0.7 శాతం క్షీణించి 76,933.59 వద్ద, నిఫ్టీ 50 116.90 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లుజర్స్ గా నిలిచాయి. నిఫ్టీ ఫార్మా , నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి
