సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నేడు, శనివారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు మరియు కొత్తపల్లి నాగరాజు ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు. దేవాలయ కమిషనర్ నల్లం సూర్య చక్ర ధర రావు (గతంలో భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయానికి సుదీర్ఘ కాలంగా సేవలు అందించారు)వీరికి శ్రీ స్వామివారి శేషవస్త్రంతో , చిత్ర పటంతో శ్రీ స్వామివారి దివ్య అస్సిసులు అందజేశారు. ఆలయం లో ఇటీవల కాలంలో జరుగుతున్నా అభివృద్ధి వివరించారు. ప్రతిరోజూ రోజు ఒకే బంతిలో 3వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించే రీతిలో శ్రీనివాస ప్రాంగణంలో సుమారు రూ.6.25 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ‘వకుళామాత అన్నదాన భవనం’ ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు ది.30-08-2026, ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు వివరించారు. .
