సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన భీమవరం శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కళ్యాణ మండపానికి విశ్రాంత మండప నిర్మాణానికి నేడు, ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. దాతలు భక్తులు దేవదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో నిర్మాణ పనులను చేపట్టడం శుభపరిణమని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు
