సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు సమీపంలో నేడు, సోమవారం ఉదయం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో భీమవరం మీదుగా రాజమంది వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రభావంతో నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్వే సిబ్బంది పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ట్రాక్ క్లియర్ అయ్యే వరకు పలు రైళ్లను నిలిపివేయడం తో నేటి సాయంత్రాని కల్లా ఆలస్యంగా రైళ్లు నడిపించే అవకాశం ఉంది
