సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో ఇరాన్‌ అమెరికా ల మధ్య ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో తెలియని పరిస్థితులు నేపథ్యంలో ఇప్పటికి హార్ముజ్ జల సంధి మూసివేత కొనసాగుతోంది. ఈ కారణంతో మన దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెంచేశారు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధరలను పెంచిన కంపెనీలు సీఎన్‌జీ (CNG) గ్యాస్ ధరలను పెంచేశాయి. వీటితో పాటు విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సైతం పెంచాయి. జెట్ ఫ్యూయల్ రేట్లను వరుసగా రెండో నెల పెంచడం గమనార్హం. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) విక్రయించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కేజీకి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం ప్రకటించింది. అలాగే డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ కు ఒక రూపాయి చొప్పున పెంచింది. ఈ ధరలను నేటి నుండి సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి తెచ్చినట్లు తెలిపింది.ఆగస్టు 1వ తేదీన ఏటీఎఫ్ లీటర్ ధరను రూ. 110 నుంచి రూ. 115కు పెంచారు. ఇప్పుడు మరో రూ. 6 వరకు పెంచడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *