సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లో వాడవాలా కీ. శే . YS రాజ శేఖర్ రెడ్డి గారి 17 వ వర్ధంతి సందర్భంగా నేడు, బుధవారం వైసీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు స్థానిక వై ఏస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళ్లను అర్పించి తెలుగు రాష్ట్రాలకు జలయజ్ఞం లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు పీజు రియంబర్స్ మెంట్ వంటి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. నేడు ఉదయం నౌడూరు లో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక MLC కవురు శ్రీనివాస్ YSRCP భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు తదితర వైసీపీ నేతలు పాల్గొని రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించారు.
