సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని కాళ్ళ మండలంలోని మాలవానితిప్ప గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్ నూతన భవనాన్ని నేడు, గురువారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు ‘బ్యాంకు లింకేజి మరియు స్త్రీ నిధి ఋణాలు’ క్రింది మంజూరైన రూ.30 లక్షల విలువైన చెక్కును అందజేశారు. అనంతరం ఇదే కాళ్ళ మండలంలోని కలవపూడి గ్రామంలో రూ.1.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్.సి. బోస్ కాలనీలో భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో ఏపీఐఐసీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు , కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
