సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కోర్టుల్లో పెండింగులో వున్న రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులను ఈ సెప్టెంబర్ 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ Dr. B. లక్ష్మీనారాయణ అన్నారు. పోలీసు, ఎక్సైజు జిల్లా అధికారులతో న్యాయమూర్తి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. భీమవరం కోర్టుల పరిధిలో వున్న అన్ని పోలీసు స్టేషన్ లకు సంబంధించి రాజీకి అనువైన కేసులను గుర్తించి ప్రతిరోజూ కక్షిదారులతో మాట్లాడి కేసులను రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రఘువీర్ విష్ణు అన్నారు. ఇప్పటివరకూ 190 ఎక్సైజు కేసులను గుర్తించి కాంపౌండింగ్ ఫీజు కట్టిస్తున్నామని ఇంకా అదనంగా 60 నుంచి 70 కేసులను రాజీకి ప్రయత్నిస్తున్నామని ఎక్సైజు జిల్లా అధికారి B. సుబ్బారావు న్యాయమూర్తికి తెలియజేసారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండపల్లి రమేష్ నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *