సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇటీవల బియ్యం తో పాటు కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యులపై భారం పడుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ NCCF సహకారంతో అవసరమైన పరిమాణంలో ఉల్లిపాయలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా రూ.35కే కిలో చొప్పున వినియోగదారులకు అందించనున్నారు లీటర్ పామాయిల్‌పై కూడా ₹10 వరకు, కందిపప్పుపై కూడా ధరలు తగ్గించనుంది.నిత్యావసరాల ధరల నియంత్రణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
