సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విధి ఎంత విచిత్రం.. వరుస 6 భారీ పరాజయాలతో ఇక రవితేజ పని అయ్యిపోయింది. అని దాదాపు అందరు పిక్స్ అయిపోయిన నేపథ్యంలో ‘లో బడ్జెట్‘ లో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం విడుదల అయ్యి ఈ ఏడాది ఒకటికి 10 రేట్లు భారీ లాభాలు సాధించిన సినిమాగా లక్షలాది ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తుంది. నిన్న మూడో ఆదివారం (17వ రోజు) ఆన్‌లైన్‌లో ఏకంగా 2.15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు నమోదైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, రూ. 120 కోట్ల షేర్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఇంకా జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు.ఇదే స్పీడ్ కొనసాగితే సినిమా 5వారాలకు 250 కోట్ల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. భీమవరం టౌన్ లో ఇప్పటి వరకు అయితే సామాన్య టికెట్స్ ధరలపైనే 17రోజులకు 84లక్షలు కలెక్షన్ సాధించి కోటి రూపాయలు దిశగా అడుగులు వేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *