సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి అర్ద మండలి దీక్షధారణ కార్యక్రమం నేడు, ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ కార్యక్రమం నిర్వహించారు 21 రోజులకుగాను 165 మంది భక్తులు శ్రీ అమ్మవారి మాలలు ధరించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ఆలయ ధర్మకర్తలు తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మవారి కరుణతో తమ జీవితాలు సుఖప్రదం కావాలని 20 రోజుల క్రితం వందలాది మంది భక్తులు 40 రోజుల మండల దీక్ష తీసుకోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *