సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి విడివడిన నూతన పశ్చిమ గోదావరి లో భీమవరం కేంద్రంగా భీమ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. (BUDA)కు సొంత భవనం అందుబాటులోకి వచ్చే వరకు భీమవరం మున్సిపల్ కార్యాలయంలోనే తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించ దానికి ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ ఆఫీసు పైభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఫ్లోర్‌ను దీనికోసం టాయించారు. బుడా ఇన్‌చార్జి డీపీటీవోగా సుధాకర్ ఇప్పటికే నియమితులు అయ్యారు. బుడా పరిధిలోకి భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలతోపాటు ఆకివీడు నగర పంచాయతీ బుడా పరిధిలోకి రానున్నాయి మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరెడ్డి బుడా కార్యాలయం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వచ్చే అక్టోబర్ నెల విజయదశమి కి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇంతకీ కీలకమైన ఉడా చైర్మెన్, కూటమి నేతలు లో ఎవరు అన్నది కూడా మరి కొద్దీ రోజులలో అధికారిక ప్రకటన రానుంది.
