సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టాన శివారు గ్రామాలను కూడా సుందరీకరణ చేసి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. వీరవాసరం మండలం కొణితవాడ గ్రామంలో సుమారు రూ కోటి 8 లక్షల లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పాఠశాలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. సుమారు రూ 20 కోట్లతో భీమవరం నియోజక వర్గంలోని గ్రామాలకు రోడ్లు వేయడం జరిగిందని, మరో రూ 100 కోట్లతో మరెంత అభివృద్ది చేస్తామన్నారు. గ్రామాలను అభివృద్ది చేయడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని, అన్ని గ్రామంలోని సీసీ రోడ్లు, డ్రెయిన్లు వేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు,, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు
