సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో రైల్వే మరింత ఆదునికరణకు మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు నేడు, బుధవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే ఏడు హైడెన్సిటీ కారిడార్లను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సుమారు రూ.11 వేల కోట్ల విలువైన మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ లోని రైల్వే కు భారీ లబ్ధి చేకూరనుంది. హౌరా-చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా నాలుగు లైన్ల నిర్మాణం జరగనుంది. దీనితో గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే రైళ్లు సంఖ్యతో పాటు వాటీ వేగం కూడా పెరగనుంది. ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, తిరుపతి రేణిగుంట మీదుగా నాలుగు లైన్లు రానున్నాయి. అలాగే ఘట్‌కేసర్‌- కాజీపేట పరిధిలో నాలుగో లైన్‌ను రూ.2,418 కోట్లతో 110 కి.మీ. మేర నిర్మించనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *