సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, గురువారం మీడియా సమావేశంలో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతను సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఇంత దారుణంగా మోసంచేశారని గుట్టు బయటపడిన వారిలో పశ్చత్తాపం లేదని, సిబిఐ విచారణకు గాని మంత్రి లోకేష్ రాజీనామాకు కానీ అంగీకరించడం లేదని విమర్శించారు. ఇటువంటి వారికి మద్దతు ఇస్తునందుకు బీజేపీ జనసేన కూడా సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు పరీక్షలే నిర్వహించకుండా ఉద్యోగాలు ఇవ్వడమేమిటని? స్పోర్ట్స్ కోటాలో పెద్ద స్కాం జరిగిందని ఇప్పటికే ఆధారాలుతో సహా తేలిపోయిన చర్యలు లేవని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో తాను ఇప్పటికే డీఎస్సీ స్కాం పార్ట్-1 పేరుతో పలు అంశాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూనే.. త్వరలోనే డీఎస్సీ స్కాం పార్ట్-2లో మరిన్ని అక్రమాలను బయటపెడతానని ప్రకటించారు. ఈసారి కేస్ స్టడీలతో సహా అన్నింటినీ వెల్లడిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపైనా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
