సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ ముడిచమురు ధరలు నేడు, శుక్రవారం ఏకంగా బారెల్ $108 దాటడం భారత్ దేశీయ మార్కెట్ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. గత 2 వారాలుగా నష్టాల బాటలో పయనిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న కాస్త ఊరట నిచ్చిన నేడు, శుక్రవారం నష్టాలతో ఈ వారం కూడా ముగించింది. ప్రధానంగా మెటల్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నష్టాల్లో కూరుకుపోగా, ఐటీ, టెక్ రంగాలు స్వల్పంగా రాణించి మరింత పతనాన్ని అడ్డుకున్నాయి. వారాంతంలో నేడు శుక్రవారం కూడా సెన్సెక్స్ 120.84 పాయింట్లు (0.16శాతం) నష్టపోయి 74,781.76 దగ్గర ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 79.70 పాయింట్లు (0.34శాతం) నష్టపోయి 23,398.10 వద్ద ముగిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *