సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో వాడవాడలా నేడు, సోమవారం స్థానిక యువత ఆధ్వర్యంలో వందలాది చవితి పందిళ్ళ సందడి , గృహాలలో పూజల కనిపించింది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షపు ముసురు నేపథ్యంలో నేడు, సోమవారం ఎండ కాయడం పందిళ్ళలో ఉత్సవ నిర్వాహకులు ఊపిరి తీసుకొన్నారు. నేడు చాల చోట్ల మధ్యాహ్నం, పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. గత సాయంత్రం చిరు జల్లులు తప్ప వర్షం లేకపోవడంతో పూజ సామాగ్రి , విగ్రహాలు అమ్మే వారు కాస్త ఉపరి తీసుకొన్నారు. అయితే పెద్ద స్థాయిలో ప్రజలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చెయ్యకపోవడం స్వష్టంగా కనపడింది. స్వీట్స్ దుకాణాలు లో ఇదే పరిస్థితి, ఈసారి తక్కువ స్థాయిలోనే స్టాల్స్ ఏర్పాటు చెయ్యడం గమనార్హం. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోవడడంతో ఈసారి 9రోజులు ఉత్సవాలు బాగా తగ్గిపోయాయి. ఇక భీమవరం పట్టణంలో స్థానిక శ్రీ గణేష్ దేవాలయాలతో పాటు మెంటే వారి తోటలో, రెస్ట్ హౌస్ రోడ్డు , దుర్గాపురం లోను , గునుపూడి లోను 20వ వార్డులోని స్థానిక నరహరి శెట్టివారి వీధి. గన్నాబత్తుల వారి వీధి, మోటుపల్లి వారి వీధి, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ కళా వేదికపై,సుంకర పదయ్యా వీధి, పంచా రామం వద్ద భారీ పందిళ్ళలో 7 -12 అడుగుల వరకు భారీ విగ్రహ రూపాలలో పూజలు అందుకొంటున్నారు. స్థానిక భీమేశ్వర గుడి దగ్గర ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. ఇక 2 టౌన్, 3 టౌన్ లలో, అపార్ట్మెంట్స్ లో కూడా చక్కటి నిర్వహణ తీరుతో పలు చోట్లా శ్రీ వినాయక పందిళ్లు ఏర్పాటు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *