సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్న వేళ టీటీడీ తిరుమల వచ్చే భక్తుల కోసం నందకం‘ యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. కొండకు వచ్చే భక్తుల కు వసతి గదులు, కాటేజీలలో సమస్యలపై ఫిర్యాదు చేసేలా అవి తక్షణం అధికారుల దృష్టికి వెళ్లేలా, వారు పరిశీలించేలా ..ఈ నందకం యాప్‌ను తీసుకొచ్చింది. ఇకపై భక్తులు వారి సమస్యల్ని యాప్ ద్వారా తెలియజేస్తే పరిష్కరించేలా ఈ యాప్ ప్లాన్ చేశారు. ఇప్పటికే నెల రోజుల పాటూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు.. త్వరలోనే భక్తులందరికి అందుబాటులోకి తీసుకురానుంది. ఎఫ్‌ఎంఎస్ (ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా ‘నందకం’ పేరుతో కొత్త యాప్‌ను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.