సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నడివయస్సు కు చేరిన లేదా ప్రభుత్వ ఉద్యోగం వసిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది. లక్షలాది మందికి లబ్ధి చేకూర్చేలా నాన్-యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని ఏకంగా 44 ఏళ్లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జీఏడీ ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 187ను విడుదల చేశారు. ఈ నిర్ణయం ముఖ్యంగా గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఖాళీలు భర్తీ కాకపోవడంతో వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
