సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్ఛోక సుమారు 2న్నర ఏళ్ల తరువాత కొత్తగా పింఛన్‌ల కోసం ఇటీవల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. . ఈ నెల 7న ప్రారంభమైన ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబర్ 18) రాత్రి 9 గంటలకు ముగిసింది. పింఛన్‌ల కోసం మొత్తం 13.40 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ కోసం 6.80లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరుకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి అర్హులైన వారికి పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *