సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో భక్తుల కోర్కెలు నెరవేర్చే నిలువెత్తు బంగారు తల్లిగా పేరుగాంచిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారని, వారికి అన్న ప్రసాదాన్ని అందించడానికి వీలైనంత విశాలమైన స్థలం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఈనేపథ్యంలో నేడు, శనివారం శ్రీమావుళ్ళమ్మ దేవస్థానంకు అతిసమీపంగా ఉన్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని అన్న సమారాధనకు ఉపయోగపడుతుందా?అని ఎమ్మెల్యే అంజిబాబు దేవస్థానం సభ్యులు, ఛాంబర్ ప్రసిడెంట్ మానేపల్లి సూర్యనారాయణ గుప్త కార్యదర్శి కాగిత వెంకట రమణ ఇతర సభ్యులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఇటీవలే లీజుకు తీసుకున్న 9 సెంట్ల స్థలంలో ప్రతిరోజు 200 నుంచి 300 మంది భక్తులకు భోజనం అందిస్తున్నామని, ఇంకా విశాలమైన స్థలం ఉంటే త్వరలో ఉత్సవాల నేపథ్యంలో వచ్చే వేలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా, మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చునని ఎమ్మెల్యే అంజిబాబు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *