సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో .. తాజగా నేడు, శనివారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు ప్రస్తుత మండల ప్రజా పరిషత్‌ల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియనుండటంతో సెప్టెంబర్ 24 నుంచే అవి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళతాయి. మండలాలకు ఎంపీడీవో కంటే పైస్థాయి ర్యాంకు కలిగిన ఆర్డీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు ఇన్ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారు. మరోవైపు జెడ్పీల గడువు సెప్టెంబర్ 24తో ముగియనుండటంతో సెప్టెంబర్ 25 నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లు జెడ్పీ ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ తాత్కాలిక పాలన గరిష్టంగా ఆరు నెలల పాటు అమల్లో ఉండే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *