సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయము అయినటువంటి శ్రీఅశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి వేడుకలు ముగింపు నేపథ్యంలో నేడు, బుధవారం శ్రీ వినాయక్ స్వామివారి ప్రతిమ నిమజ్జనం కార్యక్రమానికి ముందు నేటి మధ్యాహ్నం దేవాలయ ఆవరణలో పందిరి క్రింద భక్తులకు అన్నదాన వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు స్వామి వారికి తాపేశ్వరం కి చెందిన సురుచి స్వీట్స్ వారు సమర్పించిన 51 కేజీల లడ్డూ ను భక్తులకు వితరణ చేసి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో .ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ ఉదిశి మీనాక్షి అతికెల ఆంజనేయ ప్రసాద్ గుసిడి జానకి నాగ శిరీష కారెంపూడి ఆదిలక్ష్మి మల్లువలస లక్ష్మి నిర్మల గొంతెన రమణ యండ సత్యవతి పాపోలు ఏడుకొండలు పాల్గొని అనంతరం శ్రీ స్వామి వారి నిమజ్జన ఊరేగింపు( ఫై ఫొటోలో) కార్యక్రమం ప్రారంభించారు.
