సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ పరిణామాలు నేపథ్యంలో నిన్నటి బుధవారంవరకు భారత్ లో పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు నేడు,గురువారం ఒక్కసారిగా భారీ తగ్గుదల నమోదు చేశాయి. నేటి గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మర్కెట్స్ హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1520 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1400 మేర తగ్గింది
