సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 2 ఏళ్ళు షూటింగ్ చేసుకొన్నా నాచుర‌ల్ స్టార్ నాని (nani) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని న‌టించిన ది పార‌డైజ్ (paradise) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ద‌స‌రా వంటి హిట్ త‌ర్వాత శ్రీకాంత్ ఒదెల తో క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో రిలీజ్ ముందు నుంచే అంచ‌నాలు పెరగటం తో ప్రమియర్ షో లు టికెట్స్ ఫై అదనపు రేట్ల హడవితో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అదే రేంజులో ఉండి నాని కెరీర్ బెస్ట్ ఒపెనింగ్స్ ద‌క్కించుకుని కొత్త రికార్డులు సైతం న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోగత బుధ‌వారం రాత్రి ప్ర‌త్యేక ప్రీమియ‌ర్స్‌తో భారీ వర్షాలతో సైతం ప్రేక్షకులు తిల‌కించేశారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే పాటలు, భారీ నేపథ్యం బాగున్నాయి. మొదటి పార్ట్ బాగుంది. ఇక ఇంటర్వెల్ తరువాత సినిమా అనవసర మలుపులు తో ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెడుతుంది. తినడానికి తిండిలేక బెల్లం తిని బ్రతికే అతి పేద మనుషులు ఉన్న ఆ జాతివారు గొడవ వస్తే వందలాది బైకు లతో యుద్దానికి వెళ్లిపోవడం లాజిక్ కు అందదు. .సినిమా ఆరంభంలోనే టైటిల్ కార్ట్స్‌తో రెండు రాష్ట్రాల ప్ర‌ముఖులు,ఎన్టీఆర్, KCR,కెసిఆర్ గ‌ద్ద‌ర్ వంటి వారి క్యారెక్టర్ లను ఫొటోల‌ను వాడ‌డం, లెజండ‌రీ యాక్టర్ మోహ‌న్ బాబు టైటిల్ కార్ట్ వేయ‌డం మాత్రం ఎక్ట్రార్డ‌న‌రీగా అనిపించింది వ్యభిచారం చేసుకొని బ్రతికే యువతుల క‌థ నేప‌థ్యాన్ని తెలిపి.. అదే పాయింట్‌లో విల‌న్ మోహ‌న్ బాబు సికంజా మాలిక్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డం, ఆయ‌న‌ పైశాచిక‌త్వాన్ని చూపించిన విధానం. లోతైన డైలాగ్స్ తో దశాబ్ది క్రిందట వచ్చిన యమదొంగ తరువాత ఇదే బెస్ట్ క్యారెక్టర్ మోహన్ బాబుకు… చక్కగా నటింకాహారు.. ఇక హీరో నాని జ‌డ‌ల్ ఇంట‌ర్‌డ‌క్ష‌న్‌, బ్యాక్ స్టోరి బాగున్నా , నిజానికి నాని ని ఆ గెటప్ లో చూడడానికి ఇబ్బందిగా ఉంది. అయితే హీరో నాని కష్టం తెరపై కనిపిస్తుంది.కేజీ ఎఫ్, ఛ‌త్ర‌ప‌తి, పెద్ది, బాహుబ‌లి, వంటి చాలా సినిమాలను కలపి ఈ సినిమా తయారు చేసారు అనిపిస్తుంది. ఈ సినిమాకు పాటలు అనిరుద్ సంగీతం పెద్ద హైలైట్.. మనుషులను ఇంత తేలిగ్గా నరికి చంపవచ్చా ?అన్న కోణంలో క్రైమ్ ను భారీ రక్తపాతంతో నింపేశారు. యాక్షన్ సినిమా ప్రియులు కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది కానీ, నాని హోంలీ సినిమాల హీరోగా మరల మారిపోతే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *