సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 64,21,044/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 90 మంది లబ్ధిదారులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు నేటి గురువారం సాయంత్రం అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఆసరాగా ఉంటుందని, ఈ సహాయం కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గించి, చికిత్సను కొనసాగించేందుకు తోడ్పాటునందిస్తుందని, పేర్కొన్నారు.
