సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా పలు ఎన్నికలలో అధికార బీజేపీకి మద్దతుగా పని చేస్తున్న ఆరోపణలు ఎదురుకొంటున్న భారత ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌, రాజినామా కోరుతూ ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఉపందుకొంటుంది. ఇటీవల ఢిల్లీలో తన ఆందోళనలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని రాజీనామా చేయించిన జెన్ జీ వారి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అక్టోబర్ 2న నిర్వహించబోయే నిరసనకు సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన మద్దతును ప్రకటించారు. దేశ నాయకుల్లో జవాబుదారీతనం పెంచే ఎలాంటి కార్యక్రమానికైనా తన మద్దతు ఉంటుందని, అలాగే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్నికి వెన్నెముక లాంటిదని, అటువంటి ఎన్నికల ప్రక్రియలో సాక్షాత్తు ఎన్నికల కమిషన్ వివాదాస్వదంగా వ్యవహరిస్తుందని, అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని? వాంగ్‌చుక్ ప్రశ్నించారు.కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా గత ఎన్నికలలో ఓటమి చవి చుసిన పలు పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *