సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా రేపటి సోమవారం నుంచి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ సమ్మె ప్రభావంతో 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంక్ సేవల్లో అంతరాయం క్రమంలో ఖాతాదారులు సమస్యలు ఎదుర్కొనున్నారు. వారానికి ఐదు రోజుల వర్కింగ్ డేస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం దిగి రాకపోతే వచ్చే నెల నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది.ఈ సమ్మె ప్రభావంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. స్టేట్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు జరగవు. అయితే ప్రైవేట్, సహకార బ్యాంకులు యథావిధిగా తెరిచే ఉంటాయి. అయితే ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు విధులకు హాజరవుతారా?లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లాంటి ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదు
