సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనివిని ఎరుగని రీతిలో బియ్యంతో సహా అన్ని నిత్యావసర వస్తువులు మార్కెట్లో కూరగాయల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు. మొన్నటి వరకు ఎండలు మండిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్‌నినో ప్రభావం దీనికి కారణం అన్నారు, ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగాయి.ఇక అన్నిటికి ఇదే కారణం చూపుతున్నారు. ఏపీలో వర్షాలు లేకపోవడంతో త్వరలో కరువు వస్తుంది అని ప్రచారం తో బియ్యం ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచిపారేసారు. సన్నబియ్యం 26 కేజీలు గత 2 ఏళ్ళతో పోలిస్తే రిటైల్ లో సుమారు 600 రూపాయలు అదనంగా పెరిగింది..అంటే 1100 పలికిన ధర 1700 కు లేదా ఇంకా మంచి క్వాలిటీని బట్టి 2000 వేల వరకు పెరిగిపోయింది. రాజకీయ అండదండలతో.. ఇది సిండికేట్ వ్యాపారుల చలువ ? లేక అధికారుల నిర్లిప్తత ?ప్రజలకు అర్ధం కావడం లేదు. పాలు,పప్పులు ఉప్పులు, అల్లం, వెల్లులి, వంట ఆయిల్స్( లీటర్ కు 60రూపాయలు అదనంగా పెంచిపారేసారు. సుమారు 200 వరకు అమ్ముతున్నారు.) గత రికార్డ్స్ బ్రద్దలు కొడుతూ భారీ భారీగా రేట్లు పెరిగిపోతున్నాయి. గత నెలరోజులుగా కేజీ 70 రూపాయలు నుండి 80 రూపాయలు కు,పచ్చి మిర్చి రూ.40 నుంచి80కు రిటైల్ మార్కెట్ లో అమ్ముతుంటే ఎక్కడో పాకిస్తాన్, శ్రీలంక లో ధరలు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడటం కాదు ఇక్కడ ఏపీలో ఇంత దారుణంగా ధరలు పెరిగిపోతుంటే ఎవరు అడిగే దిక్కు లేదు. ఇక ఆకూ కూరలు ధరలు గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అంటూ రేట్లు డబుల్ చేసారు. దీనికి కారణం అందరు వ్యాపారస్తులు, అధికారులు మాత్రమే బాధ్యత కాదు.. దీని లోతు చాల ఉంది. దానిపై రాజకియ పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు గట్టిగ స్వాందించాలి .ఇలా ధరలు పెరుగుతూ పోతుంటే మరో పక్క వ్యాపారాలు లేక, పనులు లేక ప్రజలు ఆదాయాలు తగ్గిపోతుంటే.. ఎన్ని ప్రభుత్వ పథకాలు ఇస్తే ఏమి లాభం?ప్రజలు నిరాశ నిసృహ కు లోనుకాకుండా ముందు ప్రజలు బ్రతకాలి కదా? ఇప్పటికైనా ‘వాస్తవాలు’ గమనించి రాష్ట్రంలో కూటమి సర్కార్ ధరలు అదుపు చెయ్యాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *