సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ, సుపరిపాలన, దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన ‘నమో సేవా గాథ’ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, సోమవారం భీమవరం బీజేపీ కార్యాలయం వద్ద కళాకారుల డప్పు వాయిద్యాల మధ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ప్రజాసేవ, దేశాభివృద్ధికి మోదీ అందించిన సేవలను ప్రజలకు చేరువ చేయడమే ‘నమో సేవా గాథ’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడ్డాయన్నారు. నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనము పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, గ్రామాల్లో ఈ బృందం ప్రదర్శనలు నిర్వహిస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *