సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తీవ్ర వివాద స్వదంగా మారిన కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు తీవ్ర ఆక్షేపణకు గురి అవుతుంది., కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు గురిఅవుతున్న నేపథ్యంలో .. కొన్ని తప్పులు దిద్దుకోవడానికి ఈసీ ముందుకు వచ్చింది. దానిలో భాగంగా తాజాగా ఓటర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. సర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫారం-6 ఆన్‌లైన్ దరఖాస్తుల నుంచి ‘SIR డిక్లరేషన్’ను ఉపసంహరించుకుంది. ఇప్పటికే సర్ ప్రక్రియ పూర్తైన రాష్ట్రాల్లో ఓటర్లుగా తమ పేరును కొత్తగా నమోదు చేసుకోదలిచిన వారు సాధారణ ఫారం-6ను సమర్పించాలని ఈసీ పేర్కొంది. మునునటి సర్ ప్రక్రియలో పెట్టిన నిబంధన ప్రకారం ఇకపై తల్లిదండ్రులు, తాతల వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో, తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది.
