సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మీ ఆధ్వర్యంలో నేడు, ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. సందర్భంగా తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ వర్తించని శాస్త్ర చికిత్సలకు చెల్లించిన వ్యయానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అత్యంత వేగవంతంగ అందిస్తూ పేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 19 లబ్ధిదారులకు 14 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి వెంటే పార్థసారధి టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్ తదితర నేతలు పాల్గొన్నారు.
