సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు , తమిళ, కన్నడ బాషలలో 60 కి పైగా ప్రయోగాత్మక సినిమా లకు దర్శకత్వం వహించిన తెలుగువాడు సింగీతం శ్రీనివాస్ 96 ఏళ్ళ నిండు జీవితం ముగించి చెన్నయి లోని ఒక ప్రవేటు ఆసుపత్రిలో కన్ను మూసారు. మయూరి, పుష్పకవిమానం, ఆదిత్య 369 వంటి ఎన్నో అపూర్వ సినిమాలు కు ఆధునిక భావాలకు ఆయనే మార్గదర్శి. .అల్లు అర్జున్ హీరోగా వరుడు సినిమాలో కీలక పాత్రలో కూడా నటించారు. నెల్లూరు జిల్లా నుండి ఎప్పుడో మాయ బజారు సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గ తన ప్రస్థానం ప్రస్థానం ప్రారంభించిన సింగీతం ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమాకు కూడా తన సహకారం అందించారు. అలాగే నాగ్ అశ్విన్ నిర్మించిన .. గత నెలలో విడుదల అయిన ‘సింగ్.. గీతం’ సినిమా ఆయన ఆఖరి దర్శకత్వంలో వచ్చిన యూత్ కోసం తీసిన సినిమా కావడం గమనార్హం. వయస్సు ఎంత మీద పడుతున్న కూడా యువకుడిగానే కొత్త ఆలోచనలతో ఉత్సహంతో జీవించిన ఆయన ఫిలాసఫీ కూడా అందరికి ఆదర్శం.
